Jump to content

సామెతలు - మ

వికీవ్యాఖ్య నుండి
సామెతలు
అం అః
క్ష

"మ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి


  • మాటలతో మాన్యం సంపాదించవచ్చు
  • మాట చుట్టమే కానీ పూట చుట్టం కాదు
  • మంగలిని చూసి గాడిద కుంటినట్లు
  • మంచికి పోతే చెడు ఎదురైనట్లు.
  • మంచోడు, మంచోడు అంటే, చంకనెక్కి కూర్చున్నాడు
  • మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంట
  • మంచోళ్ళకు మాటలతోను, మొండోళ్ళకు మొట్టికాయ వేసి చెప్పాలి
  • మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
  • మండుకి పంపితే మాసకానికి వచ్చాడట
  • మందెక్కువైతే, మజ్జిగ పల్చనవుతుంది
  • మజ్జిగకి గతిలేనివాడు పెరుగుకి చీటీ రాసేడంట
  • మడి దున్ని మహరాజు అయినోడు, చేను దున్ని చెడ్డోడైనోడు లేడు...
  • మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?
  • మనదే దీపం అని ముద్దు పెట్టుకుంటే నోరు కాలుతుంది
  • మనం కాలాన్ని కొలవగలిగింది మార్పుతోనూ, నూతనానుభవాలతోనూ మాత్రమేగదమ్
  • మనిషి మర్మం, మాను చేవ బైటికి తెలియవు
  • మనిషికో మాట గొడ్డుకో దెబ్బ
  • మనిషి ఒక్కటి తలిస్తే దేవుడొకటి తలిచాడు
  • మహారాజు వారికి మనవి చేసుకుంటే మరో రెండు వద్దించ మని చెప్పారంట
  • మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లు
  • మా తాతలు నేతులు తాగారు, మా మూతులు నాకమన్నాడంట
  • మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లు
  • మా బావ బజారుకెళ్ళి తొడిమెలేని వంకాయ తెచ్చాడు
  • మనిషిని చులకనచేసేది 'తన గొప్ప తానే చెప్పుకోవడం'.
  • మన జీవిత విలువను చేసిన పనులను బట్టి అంచెనా వేస్తారు. జీవించిన కాలాన్ని బట్టి కాదు.
  • మాటకు మా ఇంటికి... కూటికి మీ ఇంటికి అన్నట్లు
  • మాటలు చూస్తే కోట్లు దాటుతాయి.
  • మావోనికి ముప్ఫైరెండు గుణాలు మంచియే రెండే రెండు పాడు తనకు దెలది ఒకడు చెపితే వినడు
  • మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనె
  • మింగ లేక మంగళవారం అన్నాడట
  • మింగ మెతుకులేదు కాని, మీసాలకు సంపెంగ నూనె
  • ముంజేతి కంకణానికి అద్దమేల ?
  • మునిగి పోయే వాడికి గడ్డి పూస దొరికినట్లు
  • ముందు నుయ్యి వెనుక గొయ్యి
  • ముందుంది ముసళ్ళ పండుగ
  • ముందొచ్చిన చెవులకంటే, వెనకొచ్చిన కొమ్ములు వాడి
  • ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి
  • మూడు దుగ్గానులున్న కోతి ఆరు దుగ్గనులు తిన్నాడంట
  • ముక్కు మీద కోపం
  • ముక్కు మీద వాత పెట్టి మూతి మీద వెన్నపూస రాసినట్టు
  • ముగ్గు పిండి అట్లు వేయడానికి పనికి రాదు
  • ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదే
  • ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలి
  • ముల్లును ముల్లుతోనే తీయాలి
  • ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు
  • మూరెడు పొంగటం ఎందుకు బారెడు కుంగటం ఎందుకు?
  • మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు
  • మూనాల్లా ముచ్చట
  • మేక వన్నె పులి.
  • మెరిసేదంతా బంగారం కాదు.
  • మొండివాడు రాజు కన్నా బలవంతుడు
  • మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?
  • మొగుడు కొట్టినందుకు కాదంట, తోటికోడలు నవ్వినందుకంట
  • మొగుడు కొట్టినందుకు కాదు బాధ, తోటి కోడలు నవ్వినందుకు
  • మొగుడు పోయి తానేడుస్తుంటే మిండమొగుడు రమ్మని రాళ్ళేశాడంట
  • మొగుడు పెళ్ళాల గొడవ ఎంత సేపు అంటే అద్దం మీద ఆవగింజ ఉన్నాంత సేపు అని
  • మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కిందట
  • మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు
  • మొదటికే మోసం
  • మొదులు లేదు మొగుడా అంటే పెసర పప్పు లేదే పెళ్ళామా అన్నట్లు
  • మోరిగే కుక్క కరవడు.
  • మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి యాడనో పెట్టుకున్నాడంట
  • మోకాలుకీ బోడి గుండుకు ముడి వేసినట్టు
  • మొక్కై వంగండి మానై వంగునా
  • మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు
  • మౌనం అర్ధాంగీకారం
  • మట్టి తవ్విన వాడికే మణి రాళ్ళు దొరుకుతాయి
  • మొండికెక్కినోడిని మొగుడు ఏం చేయలేడు, రచ్చ కిక్కినోడిని రాజు కూడా ఏం చేయలేడు
  • ముఖము బాగోలేదని అద్దం పగలగొట్టినట్టు
  • మానవులు అంత ఒకటే అని నిరూపించలి
  • మూడు వండల అరవై రోజులకి మూడు గుప్ఫిల్లా కరక్కాయ పొడి
  • మెత్తాని మాటలాదురా అంటే దూది వెన్నపూస అన్నాడంట
  • మెడ పట్టుకొని నేడితే చూరు పట్టుకొని వేలాడినట్టు
  • మోసే వాడికి తెలుసు కావడి బరువు
  • మాట మోసం చేస్తే మౌనం మంచిది
  • మహా పండితుడు కూడా తప్పులు చేస్తాడు
  • ముఖం చూసి మనసు చెప్పాలి
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_మ&oldid=25894" నుండి వెలికితీశారు