సామెతలు - ఊ
Appearance
సామెతలు |
---|
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ ఘ |
చ ఛ జ ఝ |
ట ఠ డ ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
"ఊ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- ఊపిరి ఉంటే ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతకచ్చు
- ఊపిరి పోతూంటే ముక్కులు మూసినట్లు
- ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ
- ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారంట
- ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది
- ఊరకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు
- ఊర్లో పెళ్ళికి ఇంట్లో సందడి
- ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి