సామెతలు - ఉ
స్వరూపం
సామెతలు |
---|
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ ఘ |
చ ఛ జ ఝ |
ట ఠ డ ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
"ఉ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు
- ఉట్టి గొడ్డుకి ఆకలెక్కువన్నట్లు
- ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందంట | ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు
- ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు
- ఉడుత కేల ఊర్లో పెత్తనం
- ఉడుత ఊపులకు కాయలు రాలుతాయా
- ఉన్న మాటంటే ఉలుకెక్కువ
- ఉన్నది పోయె ఉంచుకున్నది పోయె అన్నట్టుంది/*ఉన్నది పోయె ఉంచుకొన్నది పోయె
- ఉన్న వూరికి చేసిన ఉపకారం శవానికి చేసిన సింగారము వృధా
- ఉన్నమ్మ గాదె తీసేసరికి లేనమ్మ ప్రాణం పోయిందనట్టు
- ఉపకారం చేయబోతె అపకారాం ఎదురైనట్లు
- ఉపాయం లేని వాణ్ని ఊర్లో నుండి వెళ్ల గొట్టమన్నారు.
- ఉప్పు రుచులకు రాజు..... రోగాలకు రా రాజు
- ఉయ్యాల్లొ పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
- ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు
- ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పమౌతుంది.
- ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు
- ఉలిపిరికట్టె కేల ఊర్లో పెత్తనం
- ఉల్లి మల్లె కాదు కాకి కోకిల కాదన్నట్టు