సామెతలు - బ
స్వరూపం
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"బ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- బండకు నరడిసినట్టు
- బుద్దిహిను డైతేగాని ఒకేగోతిలో రెండుసార్లు పడడు.
- బుద్ధి చెప్పువాడు గ్రుద్దితే నేమయా?
- బూడిద నీ నాకే కుక్కని పిండికి కాపలా ఉంచకూడదు
- బతకలేక బడి పంతులని
- బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయంట
- బతికి పట్నం చూడాలి...చచ్చి స్వర్గం చూడాలి
- బాగుపడదామని పోతే బండచాకిరి తగులుకొన్నట్లు
- బారు బంగాళాఖాతం, కొంప దివాలా ఖాయం
- బ్రతుకు నేర్పిన చక్కని పాఠమొకటి - ఆశ పడవద్దు నీకు నిరాశ లేదు.
- బుగ్గ గిల్లి జోల పాడటం
- బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికిరావు
- బెల్లం చుట్టూ ఈగల్లా
- బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాడికాయంత అన్నాడట
- బొటన వ్రేలికి సున్నమైతే బోర్లపడతాడు.
- బోడితలకు బొండుమల్లెలు ముడిచినట్లు
- బెదిరించి బెండకాయ పులుసు పోసినట్లు
- బంగారపు పళ్ళానికైనా గోడ అండ కావాలి
- బంగారానికి తావి అబ్బినట్లు
- బిందెడు ధనమిచ్చినా బావమరిది లేని సంబంధం వద్దు
- బందరు లడ్డూలాగా
- బంధువయితే మాత్రం బంధాలు తొలగిస్తాడా?
- బంధువుతో అయినా పాలి వ్యవసాయం చేయరాదు
- బంధువులకు దూరం - బావికి దగ్గర
- బంధువులంతా ఒక దిక్కు - బావమరిది ఇంకొక దిక్కు
- బక్క ప్రాణం - కుక్క చావు
- బట్టతలకూ - మోకాళ్ళకూ ముడి వేసినట్లు
- బట్టతలమ్మకు పాపిట తీయమన్నట్లు
- బట్టలిప్పి నీళ్ళు పోసుకుంటూ బావగారు వచ్చారని సిగ్గుతో చేతులెత్తి నుంచున్నదట
- బడాయి బండెడు - బ్రతుకు తట్టెడు
- బతకలేనమ్మ బావిలో పడి చచ్చిందట
- బతికి చెడినవారితో వుండొచ్చుకానీ చెడి బతికిన వారితో వుండరాదు
- బతికి చెడినవాడి బాధలు చూడు - చెడి బతికిన వాడి చేష్టలు చూడు
- బతుకంత భయం లేదు - చావంత కష్టం లేదు
- బతుకులెన్నాళ్ళు - భాగ్యాలెన్నాళ్ళు?
- బద్ధకస్తుడికి పనెక్కువ - లోభికి ఖర్చెక్కువ
- బయట తన్ని, యింట్లో కాళ్ళు పట్టుకున్నట్లు
- బయట పులి - ఇంట్లో పిల్లి
- బయటొక మాట - లోపల యింకో మాట
- బరితెగించిన వాడు బజారుకు పెద్ద
- బర్రె చస్తే పాడి బయటపడుతుంది
- బర్రె, దూడ వుండగా గుంజకేలరా గురక రోగం?
- బలం ఉడిగినా పంతం ఉడగదు
- బలపం పట్టి భామవొళ్ళో ఓనమాలు దిద్దినట్లు
- బలవంతపు బ్రాహ్మణార్థం
- బల్ల క్రింద చేతులు
- బల్లి పడిందని బావ ప్రక్కలో దూరినట్లు
- బసవదేవునికి బడితె పూజ
- బాదరాయణ సంబంధం
- బాధకొక కాలం - భాగ్యానికొక కాలం
- బాపన సేద్యం బత్తెం నష్టం
- బాపన సేద్యం బత్తెం చేటు - కాపుల చదువులు కాసుల చేటు
- బాపని సేద్యం బతకటానికీ రాదు - చావటానికీ రాదు
- బాల జ్యోతిష్యం - వృద్ధ వైద్యం
- బాలవాక్కు బ్రహ్మ వాక్కు
- బాలుర దీవెనలు బ్రహ్మ దీవెనలు
- బావకు మరదలు పిల్లపై ఆశ
- బావా! అంటే, ప్రక్కలోకి రావా! అన్నాడట
- బావా! అని చూడబోతే, రావా? అని కొంగు లాగాడుట
- బావి లోతు తెలుస్తుంది గానీ మనసు లోతు తెలియదు
- బాహువుల పందిరిలో అధరాల ఆరాటం అందాల విందుకోసం అన్నట్లు
- బిగికౌగిలి పొదరింట పరువాల విందులన్నట్లు
- బిచ్చగాణ్ణి పొమ్మన్నా, ఉండమన్నా అత్తే చెప్పాలి
- బిచ్చానికి పోయినా బిగువు తగ్గలేదు, దుప్పటి పోయినా పల్లెవాటు తప్పలేదు
- బిడ్డ చచ్చినా ఉయ్యాల మీద తీపి పోలేదు
- బిడ్డ చచ్చినా పీతికంపు పోలేదు
- బిడ్డను దించి లోతు చూచినట్లు
- బిడ్డలను కన్నమ్మా - భిక్షం వేసినమ్మా చెడరు
- బిడ్డ వచ్చిన వేళ - గొడ్డు వచ్చిన వేళ
- బీద కూటికి గానీ గుణానికి గారు
- బీదైన మాత్రాన బింకం పోతుందా?
- బుట్టలో కాపురం బూడిద పాలైనట్లు
- బుట్టలో పేలాలు వేయించినట్లు
- బుడ్డను నమ్ముకొని ఏట్లో దిగినట్లు
- బుధవారం పుట్టిన ఎద్దు భూమిని దున్నినా, త్రొక్కినా భూమి పొర్లి పొర్లి పండుతుంది
- బుధవారంనాడు పులికూడా వేటకు రాదు
- బుద్ధి భూమినేలుతూంటే రాత గాడిదలు కాస్తోంది
- బుద్ధుంటే బువ్వ తింటావు లేకుంటే గడ్డి తింటావు
- బురద గుంటలో పందిలాగా
- బులుపు తీరితే గానీ బుద్ధిరాదు
- బూడిదలో పోసిన పన్నీరు
- బూతు లేనిదే నీతి లేదు
- బెల్లం వండిన పొయ్యి - ఇంగువ కట్టిన గుడ్డ
- బెల్లమున్నచోటే ఈగలు
- బెల్లపు పొయ్యికి ఈగలే నిదర్శనం
- బెల్లం ఉన్నంతసేపే ఈగలు - సిరి వున్నంతసేపే బలగం
- బెల్లం కొట్టిన గుండ్రాయిలాగా
- బేరం చేస్తూ బ్లౌజు కొలతలడిగినట్లు
- బొంకు నేర్చి రంకు నేర్వాలి
- బొక్కలు పూడ్చి తూపులు తెరిచినట్లు
- బొగ్గుల్లో మాణిక్యంలాగా
- బొమ్మకు మ్రొక్కినా నమ్మకముండాలి
- బొల్లెద్దుకు ముఖమే సాక్షి
- బోగందాని చళ్ళకూ, సంతలో సొరకాయలుకూ గోటిగాట్లు ఎక్కువ
- బోడిగుండుకు బొడ్డుమల్లెలు
- బోడినెత్తిన కొబ్బరికాయ కొట్టినట్లు
- బోడి పెత్తనం
- బోనులో పడ్డ సింహంలాగా
- బోగందానికి ఒక మగడా?
- బోడి గుండంత సుఖం లేదు - ఊరుకున్నంత ఉత్తమం లేదు
- బోసి నోటికి పేలపిండి ప్రీతి
- బ్రతకని బిడ్డ బారెడు
- బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు
- బ్రతికితే వైద్యుడు బ్రతుకుతాడు - చస్తే బ్రాహ్మణుడు బ్రతుకుతాడు
- బ్రతికిన బ్రతుకు చావులో తెలుస్తుంది
- బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాం, బయట ఎవ్వరూ లేకుండా చూడమన్నాడట
- బ్రహ్మకైనా పుట్టు రిమ్మతెగులు
- బ్రహ్మచారీ శతమర్కటః
- బ్రహ్మజ్ఞానుల వారు వచ్చారు, పట్టుబట్టలు జాగ్రత్త అన్నట్లు
- బ్రహ్మ తలిస్తే ఆయుష్షుకు కొదవా? మొగుడు తలిస్తే దెబ్బలకు కొదవా?
- బ్రాహ్మణుడి ఆచారం నీటి కొద్దీ
- బ్రాహ్మణుడి నోరు, ఏనుగు తొండం వూరుకోవు
- బ్రాహ్మణుడికి పప్పాశ - అల్లుడికి అత్తాశ
- భంగు తాగేవారికి హంగుగాళ్ళు పదిమంది
- భక్తి వచ్చినా, పగ వచ్చినా పట్టలేరు
- భక్తి లేని పూజ పత్రి చేటు
- భగీరథ ప్రయత్నం
- భయమైనా ఉండాలి - భక్తి అయినా ఉండాలి
- భరణి ఎండలకు బండలు - రోహిణి ఎండలకు రోళ్ళు పగులుతాయి
- భరణి కురిస్తే ధరణి పండును
- భరణిలో చల్లితే కాయకు చిప్పెడు పంట
- భరణిలో పుడితే ధరణిని ఏలు
- భర్త లోకం తన లోకం - కొడుకు లోకం పరలోకం
- భాగ్యముంటే బంగారం తింటారా?
- భాంచేత్ దేవుడికి మాదర్చేత్ పత్రి
- భార్యా రూపవతీ శత్రుః
- భాషకు తగిన వేషం - ఈడుకు తగిన ఆచారం
- భాషలు వేరైనా భావమొక్కటే
- భూదేవంత ఓర్పుండాలి
- భూమినీ రాజునీ కొలిచినవాడు చెడడు
- భూతాలకి చింత బరికెలు
- భోజనానికి ముందు - వేడినీళ్ళకు వెనుక
- భోజనానికి వచ్చి పొయ్యి త్రవ్వినట్లు
- భోజనానికి వద్దంటే పట్టుచీర కట్టుకుని వస్తానన్నట్లు
- భోజనానికి పిలిస్తే రాకుండా దొడ్డిదారిన వచ్చి రోలు నాకినట్లు
- భోజునివంటి రాజుంటే కాళిదాసువంటి కవీ వుంటాడు
- బుక్క తిన్న కుక్క భయపడదు
- బుద్ధి తోడైతే బలి బరువు కాదు
- బుద్ధి ఉంటే బలము అవసరం లేదు