సామెతలు - వ
స్వరూపం
సామెతలు |
---|
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ ఘ |
చ ఛ జ ఝ |
ట ఠ డ ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
"వ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- వయసొస్తే వంకర కాళ్ళు వాడి అవుతాయి
- వస్తే కొండ పోతే వెంట్రుక
- విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు
- వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది
- వీపు విమానం మోత మోగుతుంది
- వేపకాయంత వెర్రి
- వేగం కన్నా ప్ర్రాణం మిన్న
- వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు
- వాడికి సిగ్గు నరమే లేదు
- వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి
- విస్తరి చిన్నది వీరమ్మ చెయ్యి పెద్దది
- వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
- వంకరటింకర పోతుంది పాము కాదు
- వంపూసొంపుల సేవలు వలపు పాన్పు మీదే అన్నట్లు
- వచ్చింది కొంత - పఠించింది కొంత