Jump to content

సామెతలు - గ

వికీవ్యాఖ్య నుండి
సామెతలు
అం అః
క్ష

"గ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

  • గంజిలోకి ఉప్పు లేదంటే పాయసం కి పంచదార అడిగిందంట
  • గంతా బొంత కలిసి గాడిద మోపైనట్టు.
  • గండం గడిస్తేగాని యోగం పట్టదు.
  • గంగిగోవు పాలు గరిటడైన చాలు
  • గంతకు తగ్గ బొంత
  • గవ్వ ఆందానిలేదు. గడియ పురుసతు లేదు.
  • గవ్వ గవ్వ దాచి గువ్వ గూట్లో పెట్టినట్టు
  • గతి లేనమ్మకు గంజే పానకము
  • గాజుల బేరం భోజనానికి సరి
  • గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
  • గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట
  • గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంట
  • గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్ట
  • గాలికి గడ్డపారలు కొట్టుకపోయినయట.
  • గుండ్రంగా ఉంటాను భూమినికాను, నల్లగా ఉంటాను బొగ్గునుకాను, మాట్లాడతాను కాని మనిషిని కాను.
  • గుండ్లు తేలి... బెండ్లు మునిగాయంటున్నాడట
  • గుంపులో గోవిందా
  • గుణం లేని గుండె వెలుతుర్లేని గుడిసె ఒకటి.
  • గుంపుకు అనేక శిరస్సులుంటాయి, మెదళ్ళుండవు.
  • గుంపు శక్తివంతుల్ని ప్రేమిస్తుంది, గుంపు స్త్రీ లాంటిది.
  • గుట్టకు కట్టెలు మోసినట్లు.
  • గుడ్డి కన్నా మెల్ల నయము కదా
  • గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టు
  • గుడ్డోడికి కుంటోడి సాయం
  • గుడ్డెద్దు చేలో పడినట్లు
  • గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు
  • గుమ్మినిండ గింజలుండాలె గూటాలోలె బిడ్డలుండాలె.
  • గురివింద గింజ తన నలుపెరగదంట
  • గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
  • గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
  • గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
  • గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
  • గూటిలో కప్ప పీకితే రాదు
  • గోటితో పోయేదానికి గొడ్డలెందుకు
  • గోడకేసిన సున్నం
  • గోతి కాడ నక్కలా
  • గోరంత ఆలస్యం కొండొంత నష్టం
  • గోరుచుట్టు మీద రోకటిపోటు
  • గుడ్డికేక పెట్టిన తల జుట్టు చింపినట్టు
  • గాలి తలుపు వేసినా, పుస్తకం తిరగబడదు.
  • గాడిద ఎదుట వీణ వాయించినా రాగం రాదు.
  • గాడిదకి గడ్డేసి ఆవును పాలు అదిగినట్లు
  • గొప్ప పని చేయడానికి ఏకైక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడం
  • గిద్దడి బియ్యానికి కోపం ఎక్కువ
  • గోరు చుట్టు మీద రోకలి పోటు
  • గడ్డిని తినని గేదె లేదు
  • గడ్డిపోరులో గేదె చచ్చింది
  • గుణం ఉంటే గౌరవం
  • గుడ్డి గాడిదకు దారి తెలియదు
  • గాడిదకి శంఖం ఊదినా వినదు
  • గాలికోసం వేటు వేయకూడదు
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_గ&oldid=25813" నుండి వెలికితీశారు