Jump to content

సామెతలు - ద

వికీవ్యాఖ్య నుండి
సామెతలు
అం అః
క్ష

"ద" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి


  • దంపినమ్మకు బొక్కిందే కూలిట|దంచినమ్మకు బొక్కిందే దక్కుదల
  • దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట
  • దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
  • దాసుని తప్పు దండంతో సరి
  • దిక్కులేనివారికి దేవుడే దిక్కు
  • దిగితేనేగాని లోతు తెలియదు
  • దిన దిన గండం, నూరేళ్ళు ఆయుష్షు
  • దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి
  • దున్నపోతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నాడట
  • దున్నపోతు మీద రాళ్ళవాన పడ్డట్టు
  • దున్నపోతు మీద వానకురిసినట్లు
  • దురాశ దుఃఖానికి చేటు
  • దూరపుకొ౦డలు నునుపు
  • దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
  • దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
  • దొంగలు పడిన ఆరునెల్లకు కుక్కలు మొరిగినట్లు
  • దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినట్లు
  • దానం చేయని చెయ్యి... కాయలు కాయని చెట్టు...
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_ద&oldid=6763" నుండి వెలికితీశారు