సామెతలు - ప
స్వరూపం
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"ప" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- పట్టుచీరె అరువిచ్చినమ్మ పీటపుచ్చుకు తిరిగిందట.
- ప్రకృతిలో భగవంతుడు భాసిస్తాడు, కళలో మనుష్యుడు.
- పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు
- పండగ నాడు కూడా పాత మొగుడేనా?
- పండిత పుత్ర పరమ శుంఠ
- పండితపుత్రుడు... కానీ పండితుడే...
- పందికేం తెలుసు పన్నీరు వాసన
- పగటిముచ్చట పనికిచేటు. రాత్రిముచ్చట నిద్రకుచేటు.
- పక్కలో బల్లెం
- పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
- పట్టిందల్ల బంగారం అయినట్లు.
- పని చేయకుండా సులభంగా సంపాదించగలిగేది ఒకటున్నది - అది ఆకలి.
- పని లేని మంగలి పిలిచి తల గొరిగినట్లు
- పనోడు పందిరేస్తే, పిచ్చుకలొచ్చి పీకేసాయట.
- పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
- పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది
- పప్పు దాటినాక నందైతేనేమి పందైతేనేమి
- పరుగెత్తి పాలు తాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలు
- పరస్పర సంబంధాల కొరకు ఉద్యమించడమే జీవితం.
- పరుల సొమ్ము పాము వంటిది.
- పరువం మీద వున్నపుడు పంది కూడా అందంగా ఉంటుంది
- పల్లాన పండింది; మెరకన ఎండింది; వాడికుప్ప కాలింది; వాడి అప్పుతీరింది. అయితే ఎవరు వాడు?
- పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?
- పానకములో పుడక.
- పండు ఒలిచి అరచేతపెట్టినట్టు చెప్పినాడు
- పావలా కోడికి ముప్పావలా దిష్టి
- పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా!
- పాతరోగి సగం వైద్యుడు.
- పాడిందేపాడరా, పాచిపళ్ళదాసుడా
- పాలు, నీళ్ళలా కలిసిపోయారు
- పిండి కొద్దీ రొట్టె
- పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్లి అయితే గానీ పిచ్చి కుదరదు
- పిచ్చి తగ్గింది నీకంటే, తలకు రోకలి చుట్టమన్నాడట
- పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
- పిచ్చి కోతి కొబ్బరి పుచ్చులతో పచ్చడి చేసి నెత్తికి రాసుకుందంట
- పిచ్చెక్కిన కోడి, బొచ్చంతా పీక్కందట.
- పిచ్చుక మీడ బ్రహ్మాస్త్రం
- పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
- పిచ్చోడి చేతిలో రాయి
- పిచ్చోడికి పింగే లోకం
- పిట్ట కొంచెము కూత ఘనము.
- పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ
- పిల్లికి బిచ్చం పెట్టనివాడు
- పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
- పిల్లికి ఎలుక సాక్ష్యం
- పిల్లి నక్కకు అన్నీ చెప్పి చెట్టెక్కడం చెప్పలేదట.
- పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
- పుండుకు పుల్ల మొగుడు
- పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదు
- పుడుతూ పుత్రులు పెరుగుతూ శత్రువులు
- పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
- పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి
- పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
- పుల్లయ్య వేమారం(వేమవరం) వెళ్ళొచ్చినట్లు
- పూస గుచ్చినట్లు చెప్పడం.
- పెదవులతో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించటం
- పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదు
- పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు.
- పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.
- పెరుగుట విరుగుట కొరకే
- పెళ్లి అంటే నూరెల్లా పంట.
- పెళ్లికి వెళుతూ పిల్లిని చంకనపెట్టుకున్నట్లు
- పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే
- పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట
- పైన పటారం, లోన లొటారం
- పోరు నష్టము పొందు లాభము
- పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
- పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
- పొత్తులపని సుఖం. ఒంటిగ తిండి సుఖం.
- పొట్టోడికి పుట్టెడు బుద్దులు
- పొమ్మనలేక పొగపెట్టినట్లు
- పొయ్యి దగ్గర పోలీసు
- పొరుగింటి పుల్లకూర రుచి
- పోనీలే అని పాతచీర ఇస్తే మూల కెళ్ళి మూరలేసుకుందట
- పోయిన పిల్లోడు పుట్టెడు బుద్ధితో వచ్చాడట.
- పొద్దున్నే వచ్చిన వాన పొద్దు తిరిగి వచ్చిన చుట్టం ఓ పట్టాన వదలరు అని
- పిల్లిని సంకలో పెట్టుకోని ఊరంత వెతికినట్టు
- పక్కింట్లో పోరు ఉంటె పండగంతా సంబరం
- పచ్చి పల్లవాడు దాచి పెడితే బంగారు పల్లవాడు దొంగలించినట్టు
- పెత్తనం ఎక్కడిది రా అంటే మూలాన ఉంటే తీసి భుజాన వేసుకున్నా అని
- పడ్డపుడు పైకి చూడు
- పంట పండక ముందే పంచుకోవడం
- ప్రేమ అనేది ఒక ఆట, కానీ నేను ఆటగాడిని కాదు