Jump to content

సామెతలు - ర

వికీవ్యాఖ్య నుండి
సామెతలు
అం అః
క్ష

"ర" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

  • రథచక్రంమీద కూర్చున్న ఈగ "అబ్బ! నేను ఎంత దుమ్ము రేపుతున్నాను" అనుకుంటుంది.
  • రాగి పాత్ర మరిగిందంటే, లోపల వేడిగా వుంది కదా అనుకోవాలి.
  • రాజ్యానికి రాజు అయిన తల్లికి కొడుకే.
  • రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?
  • రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము.
  • రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే, మొత్తబుద్ది అవుతుంది.
  • రాజుల సొమ్ము రాళ్ళ పాలు.
  • రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
  • రాజ్యాలు పోయినా కిరీటాలు వదల్లేదని.
  • రాత రాళ్ళేలమని ఉంటే... రాజ్యాలెలా ఏలుతారు...?
  • రాత్రులు కట్టు తాల్చక తిరుగకు. చీకటింట కురువకు.
  • రాత్రులు దానధర్మాలు చేయరాదు.
  • రాత్రులు లఘువుగా తిని, పాలు త్రాగుము.
  • రాత్రుడు ఇంటి ముంగిట పేడనీళ్ళు చిమ్మరాదు.
  • రాత్రంత రామాయణం విని పొద్దున్నే సీతకి రాముడు ఏమైతడు అని అడిగినట్టు
  • రామాయణంలో పిడకల వేట.
  • రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టు.
  • రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు.
  • రాయిని పొగిడి కప్పుకుందాం అంటే పొడి నారే పడుతుంది.
  • రాశిలో కన్న వాసిలో పెద్ద.
  • రుచి మరిగిన పిల్లి ఉట్టి మీదకు ఎగిరిందంట.
  • రుచుల కాశించి పెడల యింట విందులు కుడువకు.
  • రుమాలతో ఒడలు రద్దుకొనుచు స్నానము చేయకు.
  • రెంటికీ చెడిన రేవడి చందాన.
  • రెక్కాడితే గానీ డొక్కాడదు.
  • రెండు చేతులతో తల గోకుకొనరాదు.
  • రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు.
  • రెడ్డొచ్చె మొదలాడు.
  • రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు.
  • రోగి కోరింది అదే, వైద్యుడు ఇచ్చింది అదే.
  • రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట.
  • రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరువ దీరునా?
  • రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు.
  • రౌతు కొద్ది గుర్రం.
  • రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు.
  • రాత్రి తాగడానికి గంజి లేదంటే పొద్దున రా పులస వండి పెడతాను అంది అంట
  • రావి చెట్టు చుట్టు తిరిగితే బిడ్డలు పుడతారు అని చెబితే చుట్టు చుట్టుకు పొట్ట చూసుకుంది అంట
  • రాజు మాట రాళ్ల మీద లిఖితం
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_ర&oldid=25909" నుండి వెలికితీశారు