సామెతలు - స
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"స" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- సూది కోసం సోదికి వెళ్తే పాత బొక్కలు అన్నీ బయట పెట్టాయని
- సంక నాకే వాడిని సంభావన అడిగితే పొర్లించి పొర్లించి ముడ్డి నాకాడట
- సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందట
- సంతులేని ఇల్లు చావడి కొట్టం
- సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వేతికినట్టు
- సంగీతానికి చింతకాయలు రాలుతాయా.
- సంతోషమే సగం బలం
- సంపదలో మరపులు ఆపదలో అరుపులు
- సంబరాల పెళ్లికొడుకు సప్తాశ్టంలో కూడ వసంతాలన్నడట
- సంతృప్తిలేని జీవితానికి శాంతిలేదు; అసంతృప్తిలేని జీవితానికి వృద్దిలేదు.
- సంసారం చేద్దామని సప్తసముద్రాలలో స్నానం చెయ్యబోతే, ఉప్పు ఎక్కువై వున్నది కాస్తా ఊడింది
- సజ్జనులూ దుర్జనులూ భూమిమీద కలిసే జన్మిస్తారు. కాని తామర పువ్వుకూ జలగకీ ఉన్నట్లు గుణాలు మాత్రం వేరుగా ఉంటాయి.
- సత్రం భోజనం మఠం నిద్ర
- సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లు
- సన్నాయి నొక్కులే గానీ... సంగీతం లేదన్నట్లు...
- సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంట
- సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టం
- సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
- సర్వేజనా:సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా? మరి మా సంగతేమిటి? అన్నారట మిగతావాళ్ళు
- సాటివారితో సరిగంగ స్నానాలాడబోతే ముసలి మొగుడ్ని మొసలి ఎత్తుకెళ్ళిందట
- సాయిబ్బు సంపాదన బూబు కుట్టు కూలికి సరిపోయినట్లు
- సింగడు అద్దంకి వెళ్లినట్టు
- సింగినాదం జీలకర్ర
- సిగ్గులేని వాడికి నవ్వే సింగారం
- సిగ్గు విడిస్తే శ్రీరంగమే
- సిరికొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలు
- సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి
- సింతలేనమ్మ సంతలో నిద్ర పోయినట్టు..
- సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చింది
- సులభం కాకపూర్వం అన్ని పనులూ కష్టమైనవే.
- సొమ్మొకడిది సోకొకడిది
- సత్యం చెప్పులు తొడుక్కొనేలోగా అసత్యం భూప్రదక్షిణం చేసివస్తుంది.
- స్వేచ్చగల జైలు ఉద్యోగం.
- సరికి రాని వానికి సాములు శత్రువులే అవుతాయి
- సూక్ష్మంగా చూసే వాడికి సూర్యుడిలోన చుక్కలు కనిపిస్తాయి
- సూది బెజ్జన్ని చూసి జెల్లడ నవ్విందంట
- సహాయం చేసిన వాడిని మర్చవద్దు
- సంతానం కోసం సముద్రస్నానానికెల్తే, ఉప్పు నీళ్ల కి ఉన్నది ఊడిందట...
- సంతొషమే సగం బలం
తెలుగు సామెతలు అనేవి జీవిత పాఠాలను, బుద్ధిపూర్ణ సందేశాలను, అనుభవాల సారాంశాన్ని చిన్న వాక్యాలలో వ్యక్తం చేసే పద్యాలు/పదబంధాలు. స అక్షరంతో ప్రారంభమయ్యే కొన్ని సామెతలు సప్పు పెట్టిన చెక్కి… అర్థం: చేసిన పని ఫలితాన్ని తప్పక పొందుతారు. సంసారం కంటే స్వయంపనసు మేలు అర్థం: అతి ఆనందకరమైన జీవిత విధానం స్వీయ కృషి, స్వావలంబనలోనే ఉంది. సీతాకోకచిలుక వలె స్నేహం నిలవదు అర్థం: మోసపూరిత, అవాస్తవ స్నేహాలు ఎక్కువకాలం నిలవవు. సిరి కష్టమిచ్చినవాడికి మాత్రమే లభిస్తుంది అర్థం: కష్టపడి చేసే వ్యక్తికి మాత్రమే విజయం, సంపద లభిస్తుంది. సంస్కారమే పెద్దవాడు అర్థం: వ్యక్తిత్వానికి, జీవనానికి నిజమైన విలువను శ్రమ మరియు మంచి ఆచారాలు ఇస్తాయి. సింహం ఎప్పటికీ దంతాలు మరిచిపోలేదు అర్థం: ధైర్యవంతులు ఎప్పుడూ సాహసాన్ని, శక్తిని మరిచిపోరు; ధైర్యం వారి లక్షణం.
సామెతల ముఖ్య ఉపయోగం
జీవన పాఠాలు నేర్పడం: చిన్న వాక్యాల్లో గొప్ప సూత్రాలు. నైతిక విలువలు పెంపొందించడం: సద్గుణాలు, సమాజ నియమాలు, కృషి విలువ. సామాజిక, వ్యక్తిగత అనుభవాలు ప్రతిబింబించడం: జీవితం లో తరచూ ఎదురయ్యే పరిస్థితులపై సూచనలు.