Jump to content

సామెతలు - ఇ

వికీవ్యాఖ్య నుండి
సామెతలు
అం అః
క్ష

"ఇ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  • ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
  • ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు
  • ఇంటి పక్కన కమ్మ, చేను పక్కన తుమ్మ ఉండకూడదట
  • ఇంటికన్నా గుడి పదిలం
  • ఇంటికి ఇత్తడి పురుగుకు పుత్తడి
  • ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
  • ఇంట్లో పిల్లి, వీధిలో పులి
  • ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
  • ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
  • ఇద్దరు ముద్దు, ఆపై వద్దు
  • ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
  • ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
  • ఇల్లలకగానే పండగకాదు
  • ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
  • ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
  • ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం
  • ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
  • ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
  • ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
  • ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం
  • ఇసుక తక్కెడ, పేడ తక్కెడ
  • ఇచ్చేవాణ్ని చూస్తే చచ్చిన వాడు కూడ లేచి వస్తాడు
  • ఇంటివాణ్ణి లేపి దొంగ చేతికి కట్టె ఇచ్చినట్టు
  • ఇంటికన్నా గుడి పదిలం
  • ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి
  • ఇంటికి గుట్టు రోగానికి రట్టు ఉండాలన్నారు
  • ఇంటిపేరు కస్తూరి.... ఇంట్లో గబ్బిలాల కంపు
  • ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలన్నారు
  • ఇంటి చక్కదనం ఇల్లాలిని చూస్తే తెలుస్తుంది
  • ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత
  • ఇంట్లో పిల్లి, వీధిలో పులి
  • ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య
  • ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు
  • ఇంత లావున్నావు.... తేలు మంత్రం కూడ రాదా
  • ఇద్దరు ముద్దు, ఆపై వద్దు
  • ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు
  • ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె
  • ఇల్లలకంగానే పండగకాదు
  • ఇల్లలుకుతూ పేరు మర్చిపోయినట్లు
  • ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు
  • ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
  • ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే ఏదో కావాలని ఎవడో ఏడ్చాడట
  • ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడు
  • ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే,వల్ల కాలేదని ఒకడు ఏడ్చాడంట
  • ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటం ఉండాలంటారు
  • ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం
  • ఇసుక తక్కెడ, పేడ తక్కెడ
  • ఇల్లలకగానే పండగ కాదు
  • ఇంటి ముందు ములగ చెట్టు వెనుక వేప చెట్టు ఉండరాదు
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_ఇ&oldid=11431" నుండి వెలికితీశారు