సామెతలు - ఆ

వికీవ్యాఖ్య నుండి
సామెతలు
అం అః
క్ష

"ఆ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

 • ఆ తాను ముక్కే
 • ఆ మొద్దు లోదే ఈ పేడు
 • ఆంబోతులా పడి మేస్తున్నావు
 • ఆకలని రెండు చేతులతో తింటామా అన్నట్లు
 • ఆకలి ఆకాశమంత, గొంతు సూది బెజ్జమంత
 • ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు
 • ఆకలివేస్తే రోకలి మింగమన్నాడంట
 • ఆకారం చూసి ఆశపడ్డానే కానీ... అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట...
 • ఆకారపుష్టి నైవేద్యనష్టి
 • ఆకాశానికి నిచ్చెన వేసినట్లు
 • ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం
 • ఆకులు నాకేవాడిటికి మూతులు నాకేవాడు వాచ్చాడట
 • ఆకులేని పంట అరవైఆరు పుట్లు...
 • ఆచారానికి అంతం లేదు, అనాచారానికి ఆది లేదు.
 • ఆడది తిరిగి చెడుతుంది,మగవాడు తిరక్క చెడతాడు
 • ఆడపిల్ల పెళ్ళి, అడుగు దొరకని బావి అంతం చూస్తాయన్నట్లు...
 • ఆడబోయిన తీర్థమెదురైనట్లు
 • ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు
 • ఆడి తప్పరాదు, పలికి బొంకరాదు
 • ఆడింది ఆట పాడింది పాట
 • ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు
 • ఆదిలోనే హంసపాదు
 • ఆపదలో మొక్కులు... సంపదలో మరపులు
 • ఆమడదూరం నుంచి అల్లుడు వస్తే మంచం కింద ఇద్దరు, గోడమూల ఒకరు దాగుంటారు
 • ఆయనే ఉంటే మంగలి ఎందుకు
 • ఆరాటపు పెళ్ళికొడుకు పెరంటాళ్ళ వెంట పడ్డ్డాడట
 • ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
 • ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు
 • ఆరోగ్యమే మహాభాగ్యం
 • ఆర్చేవారే కాని తీర్చేవారు లేరు.
 • ఆలస్యం అమృతం విషం
 • ఆలి బెల్లమాయె తల్లి అల్లమాయె
 • ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాట్ట
 • ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట.
 • ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
 • ఆవలింతకు అన్నలున్నారు కాని తుమ్ముకు తమ్ముళ్ళు లేరు
 • ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?
 • ఆవుకు, దూడకు లేని బాధ గుంజకెందుకో?
 • ఆవులింతకు అన్నలు ఉన్నారు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు
 • ఆవులిస్తే ప్రేగులు లెక్క పెట్టె రకం
 • ఆశగలమ్మ దోష మెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
 • ఆహారం దగ్గర, వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదు.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=సామెతలు_-_ఆ&oldid=17091" నుండి వెలికితీశారు