సామెతలు - న
స్వరూపం
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"న" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- నందిని పందినిచేయగల వాడు.
- నక్క తోక తొక్కి వచ్చాడు.
- నక్క నదిల కొట్టుకుపోతూ ప్రపంచమంత మునుగుతుందన్నదట.
- నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట.
- నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.
- నక్కజిత్తుల వాడు.
- నక్కి నక్కి చూస్తున్నాడు.
- నట్టేట ముంచటం.
- నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది.
- నడి మంత్రపు సిరి.
- నడిచే ఎద్దును పొడిచినట్టు.
- నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవు.
- నడుమొంగనోడు.
- నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట.
- నల్ల రేగడిలో చల్లినా తెల్ల జొన్నలే పండతాయి.
- నల్లటి కుక్కకు నాలుగు చెవులు.
- నలుగురింటే నాలుగు లోకాలిన్నట్టు.
- నలుగురితో నారాయణ.
- నలుగురు నడిచే దారిలోనె నడవాలి.
- నలుపు నారాయణుడు మెచ్చు ఎరుపు ఎరిముండ మెచ్చు.
- నల్లేరు మీద నడక.
- నవ్విన నాపచేనే పండుతుంది.
- నవ్వు నాలుగు విధాలా చేటు.
- నస పెడుతున్నాడు.
- నయాన్నో భయాన్నో ధారిన పెట్టడం.
- నా యింటికి నేనే పెద్దను, పిల్లికి పెట్టరా పంగనామం.
- నాకు ముగ్గురైతే... నీకు ఆరుగురు కదా అన్నట్టు.
- నా కోడి, నా కుంపటి లేకుంటే తెల్లారదందట...
- నాగస్వరానికి లొంగని తాచు.
- నాగుబామంత కోపం జెర్రిపోతంత పిరికి.
- నాడా దొరికిందని, గుర్రాన్ని కొన్నట్లు.
- నాభికాడ చల్లబడితే నవాబుతోని జవాబియ్యచ్చు.
- నారిలేని యిల్లు - నారిలేని విల్లు.
- నాలుకమీద కాదు కడుపులుండాలె.
- నిండా మునిగిన వానికి చలేంటి.
- నిండు కుండ తొణకదు.
- నిఙ౦ నిప్పులా౦టిది.
- నిజం నిలకడమీద తెలుస్తుంది.
- నిత్య కళ్యాణం, పచ్చ తోరణం.
- నిదానమే ప్రధానము.
- నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది.
- నిప్పు ముట్టనిదే చేయి కాలదు.
- నిప్పులేనిదే పొగరాదు.
- నిమ్మకు నీరెత్తినట్లు.
- నివురు గప్పిన నిప్పులా.
- నీ కాపురం కూల్చకుంటే నే రంకుమొగుణ్ణే కాదన్నాడట.
- నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు.
- నీ వేలు నా నోట్లో, నా వేలు నీ కంట్లో.
- నీటిలో రాతలు రాసినట్లు.
- నీతిలేని పొరుగు నిప్పుతో సమానం.
- నీపప్పూ నా పొట్టూ కలిపి వూదుకు తిందామన్నట్లు.
- నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు.
- నువ్వు దంచు.. నేను భుజాలెగరేస్తాను.
- నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి.
- నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది.
- నూరు చిలుకల ఒకటే ముక్కు.
- నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది.
- నెమలికంటికి నీరు కారితే వేటగాడికి ముద్దా అన్నట్లు.
- నెయ్యిగార పెడతాడంట, పియ్యిగార కొడతాడంట.
- నెల్లాళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు.
- నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు.
- నేతిబీరలో నేతి చందంలా.
- నేల విడిచి సాము చేసినట్లు.
- నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అన్నట్లు.
- నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.
- నోరు మాట్లాడితే నొసలు వెక్కిరిస్తుంది.
- నిన్నటి పులి ఈ రోజు నక్క
- నీళ్లల్లో నిప్పు వెలగదు
- నీవు కట్టిన కొడవలి నీకే తప్పదు
- నిజం చెప్పేవాడు నష్టం పొందేవాడు
- నిద్ర లేని వానికి కలలు ఎందుకు
- నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాన్ని నమ్మరాధు
- నక్కలలొ నక్క లెక్క నటించాలే
- నక్క రేలకాయ తిన్నట్లు