సామెతలు - శ
| సామెతలు |
|---|
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
"శ" అక్షరంతో మొదలయ్యే సామెతలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
- శంఖులో పోస్తేగాని తీర్ధం కాదని.
- శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.
- శతకోటి లింగాల్లో నా బోడి లింగ మెక్కడ అన్నట్లు.
- శతమర్కటం పితలాటకం అన్నట్లు.
- శతాపరాధములకు సహస్ర దండనలు.
- శనగలుతిని చేయి కడుగుకొన్నట్లు.
- శనిపడితే ఏడేళ్ళు - నేను పడితే పధ్నాలుగేళ్ళు.
- శనిపీనుగు ఒంటరిగా పోదు.
- శని విరగడయితే చాలు అన్నట్లు.
- శనేశ్వరానికి నిద్రెక్కువ - దరిద్రానికి ఆకలెక్కువ.
- శరీరంలో తల పైభాగంలో వున్నది కాబట్టి ఎక్కువా కాదు. పాదాలు నేలను. తాకుతూవుండడంవల్ల తక్కువా కాదు.
- శల్య సారథ్యం లాగా.
- శల్యపరీక్ష చేసినట్లు.
- శవానికి చేసిన అలంకారం వలె.
- శాపాలకు చచ్చినవాడూ దీవెనలకు బ్రతికినవాడూ లేడు.
- శాస్త్రం ప్రకారం చేస్తే కుక్క పిల్లలు పుట్టాయంట.
- శాస్త్రులవారింట పుట్టాను, సోమయాజుల వారింట మెట్టాను.
- శ్రాద్ధాని కంటులేదు - యజ్ఞానికి ఎంగిలిలేదు.
- శ్రావణంలో శనగల జోరు - భాద్రపదంలో బాధల పోరు.
- శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది.
- శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు.
- శివరాత్రికి చింతాకంత చెమట.
- శివరాత్రికి శివ లింగాలంత మామిడికాయలు.
- శివరాత్రితో చలి శివ శివా అంటుంది.
- శిష్యునికెక్కడ సందేహమో గురువుకీ అక్కడే అనుమానం.
- శుభం పలకరా పెళ్ళికొడకా అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చచ్చింది అన్నాడట.
- శుభస్య శీఘ్రం.
- శుష్క ప్రియాలు - శూన్య హస్తాలు.
- శూద్ర సంతర్పణ - బ్రాహ్మణ సేద్యం.
- శృంగారమంటే ఏ తీరో - ఏ విధమో చెప్పరా నా ముద్దుల ప్రియుడా అన్నదట.
- శృంగారానికి సమయ సందర్భాలు అక్కరలేదన్నట్లు.
- శృంగారానికి సమయం - సరసానికి సందర్భం అక్కరలేదన్నట్లు.
- శృంగారానికి సిగ్గూ - ముద్దుకు బుద్ధీ లేవన్నట్లు.
- శేరుకు సవాశేరు.
- శొంఠిలేని కషాయం ఉంటుందా?
- శోభనం గదిలో తొక్కుడు బిళ్ళాట నేర్చుకున్నట్లు.
- శోభనం గదిలో సిగ్గు యౌవ్వనానికి ముప్పు.
- శోభనం నాటి ముచ్చట్లు లంఖణంనాడు గుర్తొచ్చినట్లు.
- శోభనం రోజే శ్రీవారికి నడుం పట్టేసినట్లు.
- శోభనాల వేళ - సురాలోక మార్గం అన్నట్లు.
- శ్మశాన వైరాగ్యం - ప్రసూతి వైరాగ్యం.
- శ్రీరంగనీతులు చెపుతాం ఆచరించండి అన్నట్లు.
- శ్రీరామరక్ష - సర్వ జగద్రక్ష.
- శ్రుతిమించి రాగాన పడినట్లు.
- శబ్దం లేని సింహం లేదు
- శత్రువు కన్నా స్నేహితుడి మోసం పెద్దది
- శాంతి లేకపోతే శ్రేయస్సు లేదు
- శ్రద్ధ ఉంటే శాస్త్రం తెలుస్తుంది
- శ్రమ లేకుండా ఫలం లేదు
సామెతలు – శ అక్షరం (తెలుగులో) తెలుగు సామెతలు (Proverbs) అనేవి జీవిత పాఠాలు, అనుభవాల సారాంశం, నైతిక బోధలు చిన్న వాక్యాలలో చెప్పే పదబంధాలు. శ అక్షరంతో ప్రారంభమయ్యే కొన్ని సామెతలు శత్రువు దగ్గర శక్తి ఉంటేనే జాగ్రత్త అర్థం: శక్తివంతులను సత్ఫలితంగా గమనించి జాగ్రత్తగా ఉండాలి. శ్రమ లేకపోతే శ్రేయస్సు లభించదు అర్థం: కృషి లేకుండా విజయాన్ని పొందడం అసాధ్యం. శకునం తెలుసుకుని శివుని ఆశీర్వాదం కోరాలి అర్థం: నిర్ణయాలు తీసుకునే ముందు పరిస్థితులను తెలుసుకోవాలి, ఆపై భద్రత కోసం దేవుడిని ఆశ్రయించాలి. శత్రువు కళ్లకు మేలు చెయ్యకూడదు అర్థం: శత్రువులు మనకు మంచిది చేయకపోవడం సహజం; అందువల్ల జాగ్రత్తతో ఉండాలి. శుభం కలిసినప్పుడు శ్రద్ధ అవసరం అర్థం: మంచి సందర్భంలో జాగ్రత్త, సావధానత అవసరం; అప్రయత్నంతో దాన్ని వృథా చేయకూడదు. సామెతల ఉపయోగం చిన్న వాక్యాల్లో జీవిత పాఠాలు, నైతిక విలువలు, జాగ్రత్తలు, కృషి ప్రేరణ వ్యక్తమవుతాయి. పిల్లలు, యువత, పెద్దలందరికీ నిత్య జీవితంలో అనుసరించదగిన మార్గదర్శకాలు ఇస్తాయి. సామెతలు భావాలను సులభంగా, నిశ్చితంగా గుర్తుంచే విధానం.